
Updated : 20 Jan 2022 07:00 IST
Cinema News: భయపెడుతూ.. నవ్విస్తూ
మస్త్ అలీ, అజీజ్ నజీర్, రేష్మా బరి, నజియా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఫన్ గయే యారో’. అబ్ అయేగీ కిస్కీ బారి.. అన్నది ఉపశీర్షిక. యూసఫ్ సర్తి దర్శకుడు. రూపేష్ డి.గోహిల్ నిర్మించారు. ఏలీన టుతేజా, నిర్మల్ దిలీప్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇదొక హారర్ ఎంటర్టైనర్. వినోదానికి పెద్ద పీట వేశాం. హైదరాబాద్ బిర్యానీ లాంటి పసందైన వినోదం పంచిస్తుంది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్ హుస్సేన్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Tags :