
Akhanda: ‘అఖండ’ విజయం
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ గురువారంతో యాభై రోజులు పూర్తి చేసుకుంది. 103 కేంద్రాల్లో 50 రోజులుగా ప్రదర్శితమవుతూ...పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం రాత్రి హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య యాభై రోజుల వేడుకని నిర్వహించింది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్రెడ్డి, నిర్మాతలు శిరీష్, టి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.