
Loser2: క్రీడల్లో విజయం సాధించని వారి కథతో..
ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, శశాంక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘లూజర్2’. స్పోర్ట్స్ డ్రామా జానర్లో వచ్చిన ‘లూజర్’కు కొనసాగింపుగా రూపొందింది. అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల సంయుక్తంగా తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అభిలాష్ ఓసారి కథ చెప్పడానికి వచ్చాడు. క్రీడా రంగంలో సక్సెస్ అవ్వని వారి గురించి కథ చెప్పాడు. ఇలాంటి కథలు ఓటీటీలోనే చెప్పగలమని అనిపించింది. అందుకు జీటీటీ వారు మమ్మల్ని నమ్మడం.. అందుకు అనుగుణంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో పాత్రల పరంగా పెద్ద వారు లేరు. మా ఫిల్మ్ స్కూల్ విద్యార్థులే దీని కోసం పని చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, వెంకట్, అభిలాష్, శశాంక్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.