
Updated : 21 Jan 2022 07:17 IST
Tollywood: అతడు.. ఆమె
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అతడు.. ఆమె.. ప్రియుడు...’. కలర్స్ ఆఫ్ లవ్... అనేది ఉపశీర్షిక. సునీల్, కౌశల్, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కూనం కృష్ణకుమారి సమర్పకులు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. నేర నేపథ్యంలో సాగే ప్రేమకథతో చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ని బట్టి స్పష్టమవుతోంది. వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘రచయితగా ఎన్నో సంచలనాల్ని సృష్టించారు యండమూరి. ఆయన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది. ట్రైలర్ చాలా బాగుంద’’న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మీర్.
Tags :