
Keerthy Suresh: సఖి.. ఆగమనం ఆరోజే
కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ‘గుడ్‌లక్ సఖి’.. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాని ఈనెల 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రీడా నేపథ్య చిత్రమిది. నగేష్ కుకునూర్ తెరకెక్కించారు. సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టర్‌లో కీర్తి విల్లు ఎక్కు పెట్టి.. చిరునవ్వులు చిందిస్తూ క్యూట్‌గా కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. కీర్తి ఇందులో షూటర్‌గా కనిపించనుంది. ఆమెకు శిక్షణ ఇచ్చే కోచ్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: చిరంతాన్ దాస్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.