
Updated : 22 Jan 2022 07:08 IST
Cinema News: సహనంతోనే ప్రేమ
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వర్జిన్ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది ఉపశీర్షిక. సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రదీప్ బి.అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషాశ్రీధర్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోని మూడో పాటని శుక్రవారం విడుదల చేశారు. ‘‘సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుందనే అంశం ఆధారంగా ఆరంభం నుంచి చివరి వరకు వినోదాన్ని పంచే కథ ఇది. అందరికీ నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్‌కుమార్.
Tags :