
Updated : 22 Jan 2022 07:10 IST
Malli Modalaindi: ఓటీటీలో ‘మళ్లీ మొదలైంది’
సుమంత్ హీరోగా టీజీ కీర్తి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రాజశేఖర్ రెడ్డి నిర్మాత. వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలి కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’లో నేరుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ప్రేమలో పడితే ఏం జరిగింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా గంగూలి పోషించింది. ఈ సినిమా ఫిబ్రవరిలో జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శివ.
Tags :