Aa Ammayi Gurinchi Meeku Cheppali: నన్ను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా!

‘‘ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా’’ అంటున్నారు సుధీర్‌బాబు.

Updated : 15 Aug 2022 17:17 IST

‘‘ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామనుకుంటున్నా’’ అంటున్నారు సుధీర్‌బాబు. మరి ఆ చిత్రం ఏంటి? తెరపై దాన్నెలా ఆవిష్కరించాడు? తెలియాలంటే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చూడాల్సిందే.సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్‌ ఫిల్మ్‌మేకర్‌గా కనిపించనున్నారు. కృతిశెట్టి నేత్ర వైద్యురాలిగా అలేఖ్య అనే పాత్రలో నటిస్తోంది. ‘‘అరేయ్‌ నేను ఆరు సంవత్సరాల్లో.. ఆరు సూపర్‌ హిట్లు తీశానురా’’ అంటూ సుధీర్‌ చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఈ ప్రచార చిత్రంలో ఆయన స్టైలిష్‌గా కనిపించారు. ఆయన జీవితంలోకి కృతి ప్రవేశించాక ఏం జరిగింది? ఆమెతో మంచి సినిమా తీయాలని అతను చేసిన ప్రయత్నం ఫలించిందా? ఈ చిత్రం తీసే క్రమంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నది తెరపై చూడాలి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: పి.జి.విందా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని