
Akasha Veedhullo: ఆకాశవీధుల్లో ఆలాపన
గౌతమ్‌కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవీధుల్లో’. మనోజ్ జె.డి, డా. డీజే.మణికంఠ నిర్మాతలు. గౌతమ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా... జతగా నువ్వులేని ఏకాకిగా...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. చైతన్యప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని ప్రముఖ గాయకుడు కాళభైరవ ఆలపించారు. జుడా శాండీ స్వరాలు సమకూర్చారు. ‘‘హృదయాల్ని హత్తుకునే భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. తాజాగా విడుదలైన పాటకి చక్కటి స్పందన లభిస్తోంది. సినిమా ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి. దేవీప్రసాద్, బాలపరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌రెడ్డి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.