
Suriya: ‘24’ సీక్వెల్ కోసం...
అగ్ర కథానాయకుడు సూర్య నటించిన ‘24’ దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని సినిమా విడుదలైనప్పుడే తెలిపారు విక్రమ్ కె.కుమార్. ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ‘24’ కొనసాగింపు కథ సిద్ధమైందని, ఈ ఏడాదిలోనే ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.