Ante Sundaraniki: అంటే... చిత్రీకరణ పూర్తి!
‘శ్యామ్ సింగరాయ్’తో అలరించిన నాని మరో సినిమాని పూర్తి చేశారు. వేసవిలో మరో రౌండ్ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా ఫహాద్ నాయిక.
‘శ్యామ్ సింగరాయ్’తో అలరించిన నాని మరో సినిమాని పూర్తి చేశారు. వేసవిలో మరో రౌండ్ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నజ్రియా ఫహాద్ నాయిక. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మాతలు. రొమాంటిక్ కామెడీ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ విషయాన్ని కథానాయకుడు నాని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాని ఇందులో కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ అనే యువకుడిగా కనిపించబోతున్నారు. ఆయన లుక్ కూడా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి, కూర్పు: రవితేజ గిరిజాల.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
బాక్సాఫీస్ బరిలో అదిరే ఆట వసూళ్ల వేట
క్రీడా నేపథ్య కథలపై ప్రేక్షకులతో పాటు సినీతారలు మక్కువ కనబరుస్తుంటారు. ఆట.. అందులోని సవాళ్లు.. గెలుపు కోసం చేసే సాహసోపేతమైన ప్రయాణం.. -
గోవాకు దేవర
‘దేవర’ను పూర్తి చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
నిద్ర కోసం ఆరాటపడిన రోజులున్నాయి
‘సరదాగా తీసుకునే చిన్న చిన్న విరామాలు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, చిత్రాల ఎంపిక విషయంలో ఎంతో దోహదపడతాయని నా అభిప్రాయం’ అంటోంది మృణాల్ ఠాకూర్. చేతి నిండా సినిమాలు... -
ప్రేక్షకుల్లో గమనించిన మార్పు అదే!
‘‘కొత్త కథలతో సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం. పంపిణీదారుడిగా ఉన్నప్పుడు నా అభిరుచుల్ని కథానాయకులు నమ్మారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాతగా ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రాజేశ్ దండా. -
చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా
చిత్రసీమలో ఉత్తేజాన్ని, సినీ ఔత్సాహికుల్లో స్ఫూర్తిని నింపేలా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్టు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ప్రకటించాయి. -
‘మగధీర’, ‘ప్రేమికుడు’ మళ్లీ..
రామ్‌చరణ్ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’తోపాటు, ప్రభుదేవా కథానాయకుడిగా మరో అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ప్రేమికుడు’ రీరిలీజ్‌గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
ప్రతినాయకుడిగా శివాజీ
‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఇప్పుడాయన ‘అహం’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. -
మోహన్‌లాల్ @ 360
‘మలైకోటై వాలిబన్’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్. ప్రస్తుతం ఆయన.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. -
యమధీర రాజకీయం
కన్నడ తార కోమల్ కుమార్ కథానాయకుడిగా... శంకర్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యభూమిక పోషించారు. -
రాజమండ్రిలో భీమునిపట్నం
కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్‌తో ప్రగ్యా.. బ్రదర్‌కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్‌పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలిక ఇదే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...