
Good Luck Sakhi: గెలుపే అలవాటు
మన రాత మనమే రాసుకోవాలా అంటున్న అమ్మాయి కథేమిటో తెలియాలంటే ‘గుడ్‌లక్ సఖి’ చూడాల్సిందే. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలకపాత్రలు పోషించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్‌చంద్ర పదిరి నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘మన దేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నా...’ అంటూ జగపతిబాబు చెప్పే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. బ్యాడ్‌లక్ సఖి అని పిలిపించుకునే ఓ అమ్మాయి గెలుపునే అలవాటు చేసుకుని దూసుకెళ్లే క్రమమే ఈ చిత్రమని ట్రైలర్నిబట్టి స్పష్టమవుతోంది. షూటింగ్ క్రీడ నేపథ్యంలో సాగే కథతో చిత్రం రూపొందింది. కీర్తిసురేష్ ప్రతిభావంతురాలైన ఓ పల్లెటూరి యువతిగా నటిస్తుంది. కోచ్‌గా జగపతిబాబు కనిపిస్తారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రావ్యవర్మ, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.