
Ranga Ranga Vaibhavang: రంగ రంగ వైభవం
వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కేతికశర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. బాపినీడు.బి సమర్పకులు. ఈ సినిమాకి ‘రంగ రంగ వైభవంగా...’ అనే పేరుని ఖరారు చేశారు. సోమవారం సినిమా టైటిల్ టీజర్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ‘అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు తెలుసా?...’ అనే డైలాగ్‌తో టీజర్ సందడి చేసింది. నాయకానాయికల మధ్య బటర్ ఫ్లై కిస్ థియరీ టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. యువతరంతోపాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కూడిన చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా, శ్యామ్ దత్ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.