
Published : 25 Jan 2022 01:47 IST
ఓటీటీలో విక్రమ్ ‘మహాన్’
అగ్ర తారల సినిమాలు మరోసారి నేరుగా ఓటీటీ వేదికల బాట పడుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయా చిత్రబృందాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. తమిళ కథానాయకుడు విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన ‘మహాన్’ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది. వచ్చే నెల 10 నుంచి సినిమా ప్రదర్శితం కానుందని సినీ వర్గాలు ప్రకటించాయి. తమిళంతోపాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఎస్.ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. బాబీ సింహా ముఖ్యభూమిక పోషించారు. గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే కథ ఇది. విక్రమ్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించగా, ఆయనకి సహాయకుడిగా తనయుడు ధృవ్ నటించారు.
Tags :