Published : 25 Jan 2022 01:47 IST

‘మేజర్‌’ మరోసారి వాయిదా

కొత్త సినిమాలు వాయిదాల్ని ప్రకటిస్తూనే ఉన్నాయి. కరోనాతో ఏర్పడిన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించిన ‘మేజర్‌’ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కానీ దేశంలో పలు చోట్ల కరోనా ఆంక్షలు, కొన్ని చోట్ల కర్ఫ్యూ అమలవుతుండడంతో ఆ రోజున విడుదల చేయడం లేదని, తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ముంబయి పేలుళ్ల ఘటనలో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సందీప్‌ పాత్రలో నటిస్తున్న అడివి శేష్‌కి జోడీగా సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. శోభితా ధూళిపాళ్ల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని