Updated : 25 Jan 2022 07:57 IST

సల్మాన్‌...మిమ్మల్ని తాకొచ్చా?

ల్మాన్‌ఖాన్‌ను తాకడానికి అనుమతి కోరానంటోంది ప్రగ్యా జైశ్వాల్‌. ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఇటీవల విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఆడిపాడింది. ‘మే చలా..’ అంటూ సాగే వీడియో గీతంలో ఈ జంట సందడి చేసింది. ఇటీవల విడుదలైన ఈ గీతానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సల్మాన్‌తో నటించిన క్షణాల్ని గుర్తుచేసుకొంది ప్రగ్య. ‘‘సల్మాన్‌ను ఆ పాట సెట్లోనే తొలిసారి కలిశాను. నాకు అక్కడ విషయాలేవీ తెలియవు. సల్మాన్‌ లాంటి వ్యక్తిని తొలిసారి కలుస్తున్నప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మంచిది కదా అనిపించింది. ఆయన పక్కన నటిస్తున్నాను కదా అని చనువుగా వ్యవహరిస్తే లేనిపోని సమస్యలు రావొచ్చేమో అనుకున్నాను. అందుకే తొలి రోజు షూటింగులో ‘నేను మిమ్మల్ని తాకొచ్చా?. ఇది రొమాంటిక్‌ గీతం. ఇద్దరి మధ్య కెమిస్ట్రి బాగుంటేనే పాట బాగా వస్తుంది’ అని అడిగాను. ‘దానికేముంది..నన్ను తాకొచ్చు’ అన్నారాయన. ఆయన మంచిగా ఉన్నారని అనుమతి లేకుండా చనువు తీసుకుంటే ‘ఆమె కాస్త ఓవర్‌ చేస్తుంది అనుకుంటే బాగోదు కదా’ అంటూ తన అనుభవాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ప్రగ్య. ‘మే చలా..’ గీతాన్ని సల్మాన్‌ స్నేహితురాలు యులియా, గాయకుడు గురు రంద్వా కలిపి ఆలపించారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని