
Konda: కొండాపై అయిదారు సినిమాలైనా సరిపోవు
దర్శకుడు రాంగోపాల్‌వర్మ
శ్రేష్ఠా పటేల్ మూవీస్ బ్యానర్‌పై రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ బయోపిక్ ‘కొండా’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హనుమకొండలో జరిగింది. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో కలిసి ఆర్జీవీ ట్రైలర్ విడుదల చేశారు. హీరో త్రిగుణ్, హీరోయిన్ ఇర్రా మోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ.. ఆర్జీవీ దర్శకత్వంలో కొండా మురళీ, సురేఖ పాత్రలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో తమకు అభిమానులు పెరిగారని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ.. కొండా మురళీపై చిత్రం చేయడానికి మొదట ఆలోచించానని, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత అయిదారు సినిమాలు తీసినా సరిపోవని చెప్పారు. మార్చిలో విడుదల చేస్తామని తెలిపారు. ‘కొండా-2’నూ నిర్మిస్తామని వివరించారు. కొండా సురేఖ, కొండా మురళీ మాట్లాడుతూ.. తమ జీవితాలను సినిమాగా మార్చి చాలా అద్భుతంగా తెరకెక్కించారన్నారు.
- న్యూస్‌టుడే, ఎన్జీవోస్‌కాలనీ(హనుమకొండ)