Oka Pathakam Prakaram: రాముడు... రావణుడు

సాయిరామ్‌ శంకర్‌ కథానాయకుడిగా వినోద్‌ విజయన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. అశీమా నర్వాల్‌ కథానాయిక. రవి పచ్చముత్తు, వినోద్‌  విజయన్‌, గార్లపాటి రమేష్‌ కలిసి

Updated : 27 Jan 2022 07:03 IST

సాయిరామ్‌ శంకర్‌ కథానాయకుడిగా వినోద్‌ విజయన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. అశీమా నర్వాల్‌ కథానాయిక. రవి పచ్చముత్తు, వినోద్‌  విజయన్‌, గార్లపాటి రమేష్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని ప్రముఖ  దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల  విడుదల చేశారు. ‘‘విభిన్నమైన కథాంశంతో, కాన్సెప్ట్‌ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమిది. రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్‌ శంకర్‌. సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌లోనే కనిపిస్తుంది. పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కోసం ఆరుగురు జాతీయ పురస్కార గ్రహీతలు పనిచేస్తున్నారు. మరిన్ని వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు దర్శకనిర్మాతలు. శ్రుతి సోధి, సముద్రఖని, కళాభవన్‌ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: రాజీవ్‌ రవి, వినోద్‌ ఇల్లంపల్లి, సురేష్‌ రాజన్‌, కూర్పు: కార్తీక్‌ జోగేష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు