Cinema News: కొక్కొరొకో...

విశ్వ కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్‌ కథానాయిక.   చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.చంద్రమోహన్‌రెడ్డి

Updated : 27 Jan 2022 07:08 IST

విశ్వ కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్‌ కథానాయిక.   చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.చంద్రమోహన్‌రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.    ఈ చిత్రంలోని కొక్కొరొకో... అంటూ సాగే పాటని ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు  విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కథ, కథనాలకి ప్రాధాన్యమిస్తూ తీసిన సినిమా అని అర్థమవుతోంది. ఇలాంటి చిత్రాలు విరివిగా రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. గీత రచయిత రాంబాబు గోసాల ఇందులోని పాటలన్నీ రాయడం అభినందనీయం’’ అన్నారు.  అనుభూతిని పంచే ఓ మంచి ప్రేమకథ ఇదని దర్శకుడు చెప్పారు.     ‘‘తెలుగు, తమిళ భాషలకి చెందిన నటులతో ఈ సినిమా చేశాం.   త్వరలోనే రెండు భాషల్లో విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత. భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్‌ జేపీ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: కల్యాణ్‌ బోర్లగడ్డ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని