James: సైనికుడా వందనం

దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ చివరి చిత్రం ‘జేమ్స్‌’ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి పునీత్‌కు సంబంధించిన

Updated : 25 Jan 2024 12:12 IST

దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ చివరి చిత్రం ‘జేమ్స్‌’ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి పునీత్‌కు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సైనికుడి గెటప్‌లో ఉన్న పునీత్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై ‘‘దేశానికి మీ శక్తినివ్వండి. సైనికుడా వందనం’’అని రాసింది చిత్రబృందం. చేతన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో పునీత్‌ సోదరులు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌  నటించడం విశేషం. పునీత్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని