Updated : 27 Jan 2022 07:14 IST

Navdeep: ఎవరీ ‘లవ్‌ మౌళి’?

వదీప్‌ కథానాయకుడిగా నైరా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ మౌళి’. ఫంకూరీ గిద్వానీ కథానాయిక. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్‌రెడ్డి తాటికొండ నిర్మాత. బుధవారం నవదీప్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌  లుక్‌ని విడుదల చేశారు దర్శకనిర్మాతలు. ‘‘నవదీప్‌ 2.0గా ఆయన్ని కొత్తగా పరిచయం చేసే చిత్రమిది.నవదీప్‌ వేషధారణ, ఆయన హావభావాలు ఇందులో కొత్తగా ఉంటాయి. లవ్‌ మౌళి ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి దర్శకత్వంతోపాటు... కెమెరా, ఎడిటింగ్‌ బాధ్యతల్నీ అవనీంద్రే నిర్వర్తిస్తున్నారు. గోవింద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్