OKE OKA JEEVITHAM:గానమై ఈనాడే మేలుకున్నా

‘‘నీ పాదాలకి మువ్వల్లా... నా అడుగులు సాగాలమ్మా... నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా...’’ అంటూ ఓ కొడుకు అమ్మ పాట పాడుకున్నాడు. ఆ కథేమిటో తెలియాలంటే ‘ఒకే ఒక జీవితం’ చూడాల్సిందే. శర్వానంద్‌ కథానాయకుడిగా

Updated : 27 Jan 2022 07:17 IST

‘‘నీ పాదాలకి మువ్వల్లా... నా అడుగులు సాగాలమ్మా... నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా...’’ అంటూ ఓ కొడుకు అమ్మ పాట పాడుకున్నాడు. ఆ కథేమిటో తెలియాలంటే ‘ఒకే ఒక జీవితం’ చూడాల్సిందే. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రీతూవర్మ కథానాయిక. అమల అక్కినేని ముఖ్యభూమిక పోషిస్తున్నారు. శ్రీకార్తీక్‌ దర్శకుడిగా పరిచయం  అవుతున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రభు, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమాలోని అమ్మ పాటని బుధవారం యువ కథానాయకుడు అఖిల్‌ అక్కినేని విడుదల చేశారు. ఇందులో అమ్మగా నటించిన తన తల్లి అమల అక్కినేనికి అంకితం ఇచ్చారు. ‘‘అమ్మా వినమ్మా... నేనానాటి నీ లాలి కథనే... అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే... మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా... గానమై ఈనాడే మేలుకున్నా...’’ అంటూ సాగే ఈ పాటని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరకర్త. ‘‘ఫ్యామిలీ డ్రామా చిత్రంగా సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందిన చిత్రమిది. శర్వానంద్‌కి తన కెరీర్‌లో 30వ సినిమా. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నాయి సినీవర్గాలు.  దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రానికి మాటలు రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని