Raviteja: పుట్టినరోజు ధమాకా

విజయోత్సాహంలో ఉన్న రవితేజ... ఏడాది కాలంగా అదే జోరును కొనసాగిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే ‘ఖిలాడి’గా సందడి చేయనున్న ఆయన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాల్ని పూర్తి

Updated : 27 Jan 2022 07:18 IST

విజయోత్సాహంలో ఉన్న రవితేజ... ఏడాది కాలంగా అదే జోరును కొనసాగిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే ‘ఖిలాడి’గా సందడి చేయనున్న ఆయన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాల్ని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు. బుధవారం రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమాల పోస్టర్లు, పాటలు విడుదలయ్యాయి. ‘ఖిలాడి’లోని ఫుల్‌ కిక్కు... పాటని విడుదల చేశారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఈ సినిమా పోస్టర్‌నీ విడుదల చేశారు. పుట్టిన రోజైనా రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమా పాట చిత్రీకరణలో పాల్గొన్నారు రవితేజ. ఈ చిత్రం మార్చి 25 రానుంది. సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రావణాసుర’ కొత్త పోస్టర్‌ని, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ పోస్టర్‌ని విడుదల చేశారు. మాస్‌ కథలకి, పాత్రలకి పెట్టింది పేరైన రవితేజ ఈ చిత్రాల్లోనూ అదే తరహాలో సందడి చేయనున్నట్టు ప్రచార చిత్రాల్ని బట్టి స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని