
Vikrant Rona:‘విక్రాంత్ రోణ’.. మళ్లీ వెనక్కి
కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘విక్రాంత్ రోణ’.. మరోసారి వెనక్కి తగ్గింది. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రమిది. అనూప్ భండారి తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాస్త ఆలస్యమైనా ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే విడుదల చేస్తామని, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. విభిన్నమైన యాక్షన్ అడ్వంచర్ కథాంశంతో.. త్రీడీలో రూపొందించిన చిత్రమిది. 14 భాషల్లో.. 55 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.అజనీష్ లోక్నాథ్ స్వరాలందించారు. విలియమ్ డేవిడ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.