
The Ghost: దుబాయ్‌లో... ‘ది ఘోస్ట్’ పోరాటం
ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథతో సినిమా చేసే దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన యాక్షన్ ప్రధానమైన కథ చేస్తే ఎలా ఉంటుందో ‘గరుడవేగ’తో రుజువైంది. మరోసారి యాక్షన్ నేపథ్యంలోనే సాగే కథతో ‘ది ఘోస్ట్’ చేస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దుబాయ్ వెళ్లబోతోంది చిత్రబృందం. వచ్చే నెల 3 నుంచి అక్కడ పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తారు. థాయ్‌లాండ్‌కి చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నుంగ్, అతని బృందం నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాగ్‌తోపాటు నాయిక సోనాల్ చౌహాన్ పాల్గొననున్నారు. మొదట ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా కాజల్ అగర్వాల్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె గర్భం దాల్చడంతో, కాజల్ స్థానంలో మరో నాయిక కోసం అన్వేషణ మొదలు పెట్టింది చిత్రబృందం. అమలాపాల్, మెహ్రీన్తోపాటు...పలువురు తారల పేర్లు వినిపించాయి. ఇటీవలే చిత్రబృందం సోనాల్‌ని ఖాయం చేసింది. ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.