
Updated : 29 Jan 2022 07:00 IST
Cinema News: ‘స్వ’.. కథేంటి?
మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్వ’. మను పి.వి దర్శకుడు. జి.ఎం.సురేష్ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రం చూసి సెన్సార్ బోర్డు వారు అభినందించారు. సినిమాపై మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అన్నారు.
Tags :