Cinema News: 4 భాషల్లో ‘సేవాదాస్‌’

కె.పి.ఎన్‌.చౌహాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సేవాదాస్‌’. ప్రీతి అస్రాని కథానాయిక. సుమన్‌, భానుచందర్‌ ప్రధాన పాత్ర ధారులు. ఇస్లావత్‌ వినోద్‌ రైనా, సీతారామ్‌నాయక్‌ నిర్మించారు. బంజారా, తెలుగు, హిందీ, ఆంగ్ల

Updated : 10 Feb 2022 06:52 IST

కె.పి.ఎన్‌.చౌహాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సేవాదాస్‌’. ప్రీతి అస్రాని కథానాయిక. సుమన్‌, భానుచందర్‌ ప్రధాన పాత్ర ధారులు. ఇస్లావత్‌ వినోద్‌ రైనా, సీతారామ్‌నాయక్‌ నిర్మించారు. బంజారా, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. 64 దేశాల్లోని 18 కోట్ల మంది బంజారాలతో పాటుగా ఇతర ప్రేక్షకులందరి హృదయాల్ని హత్తుకునేలా ఈ సినిమాని తెరకెక్కించామని దర్శకనిర్మాతలు తెలిపారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటి చెప్పే కథాంశంలో నటించడం గర్వంగా ఉందన్నారు నటులు సుమన్‌, భాను చందర్‌. కార్యక్రమంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌, ఐఏఎస్‌ అధికారులు భూక్యభారతి, పీర్యానాయక్‌తోపాటు నటులు విజయ్‌ రంగరాజు, గీతాసింగ్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని