Sada Nannu Nadipe: అందమైన ప్రేమకథతో..

లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాత. వైష్ణవి పట్వర్దన్‌ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ

Updated : 07 Dec 2022 17:24 IST

లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాత. వైష్ణవి పట్వర్దన్‌ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ హోంమంత్రి మహ్మద్‌ అలీ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అన్ని శాఖలపై పట్టుతో హీరో ప్రతీక్‌ ముందడుగు వేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ సినిమాలో చక్కటి ప్రేమకథ ఉంది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి హైదరాబాద్‌లో అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడ ఫిల్మ్‌సిటీ ఉంది. ఐదేళ్లలో ముంబయి తరహా సినీ పరిశ్రమను హైదరాబాద్‌లో చూడొచ్చు. కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ చిత్ర పరిశ్రమపై చర్చించారు. ఇండస్ట్రీకి ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఉంది’’ అన్నారు. దర్శకుడు, హీరో ప్రతీక్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నా రెండో చిత్రం. ‘గీతాంజలి’, ‘ప్రేమించుకుందాం రా’.. తరహాలో మంచి అందమైన ప్రేమకథతో రూపొందింది. ఫైట్స్‌, కామెడీ, రొమాన్స్‌.. ఇందులో ఉన్నాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్‌ దాస్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని