‘ఆర్‌’.. ఎవరికీ భయపడని గ్యాంగ్‌స్టర్‌

వైవిధ్యభరితమైన చిత్రాలతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు ఉపేంద్ర. ఇప్పుడాయన దర్శకుడు రామ్‌  గోపాల్‌ వర్మతో ఓ సినిమా చేస్తున్న సంగతి

Updated : 25 Mar 2022 14:46 IST

వైవిధ్యభరితమైన చిత్రాలతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు ఉపేంద్ర. ఇప్పుడాయన దర్శకుడు రామ్‌  గోపాల్‌ వర్మతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘ఆర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని వర్మ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు కొన్ని మోషన్‌ టీజర్లను ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారతదేశ చరిత్రలో ఓ నమ్మశక్యం కాని ప్రత్యేకమైన గ్యాంగ్‌స్టర్‌ కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలియజేశారు.‘‘బెంగళూరులో స్ట్రీట్‌ ఫైటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ‘ఆర్‌’.. ముంబయిలోని మాఫియానే కాకుండా దుబాయ్‌లో ఉన్న ‘డీ’ కంపెనీ అధినేత, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంనీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఇప్పుడా శక్తిమంతమైన ‘ఆర్‌’ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. ప్రపంచంలో ఎవరికీ భయపడని డేర్‌డెవిల్‌ గ్యాంగ్‌స్టర్‌ ‘ఆర్‌’’అని వర్మ తన వరుస పోస్ట్‌లలో రాసుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని