Rgv: వర్మ ‘డేంజరస్‌’ సినిమాకు చుక్కెదురు

దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన ‘మా ఇష్టం’ (డేంజరస్‌) సినిమాకు హైదరాబాద్‌

Published : 08 Apr 2022 07:03 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన ‘మా ఇష్టం’ (డేంజరస్‌) సినిమాకు హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టు బ్రేక్‌ వేసింది. తనకు వాయిదా పద్ధతిన ఇవ్వాల్సిన రూ.50 లక్షలు ఇవ్వడం లేదని తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్‌, కుమారుడు నట్టి క్రాంతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గురువారం కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు సినిమా విడుదలను ఆపేయాలని రాంగోపాల్‌వర్మకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాను ఏ ఆన్‌లైన్‌ వేదికలోనూ విడుదల చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని