చిరు చిత్రంలో.. రవితేజ

చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Published : 03 May 2022 04:43 IST

చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చినా, ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది. కానీ, చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. జూన్‌ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ కొత్త షెడ్యూల్‌లో ఆయనతో పాటు చిరుపై పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని టాక్‌. చిరు శైలికి తగ్గట్లుగా సాగే చక్కని మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ‘వాల్తేర్‌ వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని