F3 Trailer: సోగ్గాళ్లోయ్‌... సందళ్లోయ్‌

మాది దగ్గుబాటి ఫ్యామిలీ... మాది మెగా ఫ్యామిలీ అంటూ సందడి చేస్తున్నారు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ఈ ఇద్దరూ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌3’. విజయవంతమైన ‘ఎఫ్‌2’కి ఫ్రాంచైజీగా రూపొందుతోంది. తమన్నా, మెహ్రీన్‌ , సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు.

Updated : 10 May 2022 12:23 IST

మాది దగ్గుబాటి ఫ్యామిలీ... మాది మెగా ఫ్యామిలీ అంటూ సందడి చేస్తున్నారు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌. ఈ ఇద్దరూ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌3’. విజయవంతమైన ‘ఎఫ్‌2’కి ఫ్రాంచైజీగా రూపొందుతోంది. తమన్నా, మెహ్రీన్‌ , సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు... కానీ ఆరో భూతం ఒకటుంది, అదే డబ్బు’, ‘డబ్బున్నవాడికి ఫన్‌.. లేనివాడికి ఫ్రస్ట్రేషన్‌’ అనే సంభాషణలతో మొదలైంది టీజర్‌. రేచీకటితో వెంకటేష్‌, నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా వరుణ్‌తేజ్‌ కనిపించి నవ్వించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఫన్‌ బ్లాస్ట్‌ పేరుతో ఓ వేడుకని నిర్వహించారు. ఇందులో చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని