ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం

మహేష్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ మ మాస్‌ సెలబ్రేషన్స్‌’ పేరుతో కర్నూలులో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ..

Updated : 17 May 2022 11:55 IST

మహేష్‌ బాబు

హేష్‌బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘మ మ మాస్‌ సెలబ్రేషన్స్‌’ పేరుతో కర్నూలులో ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఇదేదో సక్సెస్‌ మీట్‌లా లేదు. వంద రోజుల వేడుకలా ఉంది. నాన్న సర్కారు వారి పాట చూసి ‘దూకుడు’, ‘పోకిరి’ కన్నా పెద్ద హిట్టవుతుందని చెప్పారు. ఆ మాటలే నిజమయ్యాయి. కీర్తి సురేష్‌, సముద్రఖని సినిమాలో చాలా బాగా చేశారు. తమన్‌ ఇచ్చిన ‘కళావతి..’ ఇవాళ ఒక ఆంథమ్‌లా తయారైంది. థ్యాంక్స్‌ తమన్‌. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. కొవిడ్‌ పరిస్థితుల్ని దాటుకొని మీ ముందుకొచ్చాం. మీరంతా మాకు మర్చిపోలేని విజయమిచ్చారు. ఈ విజయాన్ని మేమెప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. నేను ‘శ్రీమంతుడు’ లాంటి హిట్‌ ఇచ్చానని మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు అంటుంటారు. ఈరోజున వాళ్లు నాకు ‘సర్కారు వారి పాట’ అనే హిట్‌ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్‌, ప్రతి డైలాగ్‌.. అన్నీ మహేష్‌పై నాకున్న ప్రేమే. ఆయనకు అద్భుతమైన చిత్రమిస్తానని నేను మాటిచ్చాను. ఈ సినిమాతో అది పూర్తి చేశాను. దీన్ని గుండెల్లో పెట్టుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు పరశురామ్‌. తమన్‌ మాట్లాడుతూ.. ‘‘మహేష్‌ కనిపించడానికే క్లాస్‌. ఆయన సినిమాలకి వచ్చే కలెక్షన్లు మాస్‌. అనంత్‌ శ్రీరామ్‌ పెన్నంతే ఉంటాడు. కానీ, ఆయన సిరా అసలు ఆరిపోదు. ఈ సినిమా మాకు చాలా పెద్ద బాధ్యత. దాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ చిత్ర మ్యూజిక్‌ క్రెడిట్‌ అంతా బుజ్జీదే. తనకి మహేష్‌పై ఉన్న అభిమానాన్ని ఈ చిత్ర పాటల్లో చూపించాడు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్‌, నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, కిలారి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని