Published : 18 May 2022 02:08 IST

ఓటీటీలోనే.. సిండ్రెల్లా

క్షయ్‌కుమార్‌, రకుల్‌ప్రీత్‌లు జోడీగా తెరకెక్కిన సైకో థ్రిల్లర్‌ చిత్రం సిండ్రెల్లా. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ముందు థియేటర్లలో విడుదల చేయాలని భావించినా.. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ మారినట్టు ఆ చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రంజిత్‌ తివారీ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాకి తమిళంలో ఘనవిజయం సాధించిన ‘రత్ససాన్‌’ మాతృక. ముందు ఫీచర్‌ ఫిల్మ్‌గా తీసుకురావాలని భావించినా.. నిడివి ఎక్కువ కావడంతో ఓటీటీకి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వెబ్‌సిరీస్‌గా మలిచారు. అత్యధిక శాతం షూటింగ్‌ని బ్రిటన్‌లో పూర్తి చేశారు. మరోవైపు అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్‌’ జూన్‌ 3న విడుదలవుతోంది.


అదో భయంకర అనుభవం..

మాజీ ప్రపంచ సుందరి మానుషి ఛిల్లర్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తను నటించిన తొలి చిత్రం ‘పృథ్వీరాజ్‌’ జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా చిత్రీకరణలో తనకు జరిగిన ఒక భయంకర అనుభవాన్ని చెప్పుకొచ్చింది. జైసల్మీర్‌ పరిసరాల్లో థార్‌ ఎడారిలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఇసుక తుపానులో తాను చిక్కుకుపోయినట్లు వెల్లడించింది. ‘సీన్‌ ప్రకారం నేను ఒక ఇసుక గుట్టపై నిలబడాలి. అలా నిల్చోగానే ఒక్కసారిగా తుపాను రావడంతో సెట్లో మొత్తం గందరగోళం ఏర్పడింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మా బృంద సభ్యుడు ఒకరు నన్ను కిందకి లాగేసి దూరంగా తీసుకెళ్లిపోయార’ని ఈ భామ వెల్లడించింది. కాసేపయ్యాక షూటింగ్‌ ప్రారంభించినా ఇప్పటకీ ఆ ఘటనను తలుచుకుంటే భయంగా ఉంటుందని తన అనుభవాన్ని పంచుకుంది. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌తో కలిసి మానుషి ఎలాంటి పోరాటాలు చేసిందో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.


అందర్నీ అలరించే ‘నికమ్మా’

భిమన్యు దస్సానీ, షెర్లీ సేథియా జంటగా నటించిన చిత్రం ‘నికమ్మా’. శిల్పాశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. రొమాన్స్‌, యాక్షన్‌, హాస్యం ఇలా అన్నీ సమపాళ్లలో రంగరించి మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సబ్బీర్‌ ఖాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాయకానాయికల మధ్య ప్రేమ సన్నివేశాలు ఘాటుగానే ఉంటాయని ట్రైలర్‌లోనే చూపించారు. షెర్లీ అందం, శిల్పా శెట్టి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణలని చిత్రబృందం తెలిపింది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, సబ్బీర్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని