Aadhi: ఒక్కటైన ఆది, నిక్కి గల్రాణి

నటుడు ఆది పినిశెట్టి, నటి నిక్కి గల్రాణిల వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడు ఆది. తమిళంలో ‘సామి’ చిత్రం ద్వారా కథానాయకుడిగా అడుగుపెట్టిన ఆయన పలు చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారు.

Updated : 20 May 2022 06:46 IST

నటుడు ఆది పినిశెట్టి, నటి నిక్కి గల్రాణిల వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు రవిరాజా పినిశెట్టి రెండో కుమారుడు ఆది. తమిళంలో ‘సామి’ చిత్రం ద్వారా కథానాయకుడిగా అడుగుపెట్టిన ఆయన పలు చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు బెంగళూరుకు చెందిన నిక్కీగల్రాణి దక్షిణాది చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలసి తమిళంలో ‘యాగవరాయనుం నా కాక్క’, ‘మరగద నాణయం’ చిత్రాల్లో కలసి నటించారు. అప్పుడే ఇద్దరూ ప్రేమించుకున్నారు.  బుధవారం రాత్రి వీరి వివాహ విందు ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు నిక్కి మెడలో ఆది తాళికట్టారు. తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. విందు కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని