
Cinema News: కొత్తగా ప్రయత్నిస్తున్నా..
‘‘ట్విస్ట్‌లు.. మలుపులతో ఆద్యంతం అలరించే చిత్రం ‘ధగడ్ సాంబ’’ అన్నారు హీరో సంపూర్ణేష్‌బాబు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోదభరిత చిత్రాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు ‘ధగడ్ సాంబ’గా వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్.ఆర్.రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సంపూర్ణేష్‌బాబు.
‘‘కొబ్బరిమట్ట’ తర్వాత కొన్ని పెద్ద బ్యానర్స్‌లో సినిమా అవకాశాలొచ్చాయి. కొన్ని కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. ఇంతలో దర్శకుడు యన్.ఆర్.రెడ్డి ఈ కథ చెప్పారు. ఈ సినిమాలో హీరో చిన్నప్పుడు ఓ చిన్న సమస్య వల్ల తన ఆస్తి అంతా కోల్పోతాడు. దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మళ్లీ అతనేం చేశాడు? ఎదురైన సవాళ్లేంటి? అన్నది చిత్ర కథాంశం’’.
* ‘‘నేనిప్పటి వరకు ఎక్కువగా కామెడీ పాత్రలే పోషించాను. ఇందులో తొలిసారి కాస్త సీరియస్‌గా సాగే పాత్ర పోషించా. సంభాషణలు కొత్తగా, భిన్నంగా ఉంటాయి. హీరోగా వచ్చి నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నా. దాన్ని నిలబెట్టుకోడానికి కొత్తగా ప్రయత్నిస్తూనే వస్తున్నా’’. ‘‘నేను హీరోగా ప్రస్తుతం ‘బ్రిలియంట్ బాబు’, ‘సన్నాఫ్ తెనాలి’, ‘దాన వీర శూరకర్ణ’, ‘మిస్టర్ బెగ్గర్’ చిత్రాలు చేస్తున్నా. ఈశ్వర్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నా. తమిళంలోనూ హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’.
‘విక్రమ్’.. విచ్చేస్తున్నారు
కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కులను హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’’ అని శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ తెలిపింది. ఈ సినిమా జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కూర్పు: ఫిలోమిన్ రాజ్, ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్.
నవ్వించే ‘క్రేజీ ఫెలో’
ఆది సాయికుమార్ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. కె.కె.రాధామోహన్ నిర్మాత. దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ కథానాయికలు. ఈ సినిమాకి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ఖరారు చేశారు. గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ఆది చేష్టలు టైటిల్‌కు తగ్గట్లుగానే క్రేజీగా ఉన్నాయి. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం తెలిపింది. సంగీతం: ఆర్ఆర్ ధృవన్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి