Updated : 21 May 2022 08:19 IST

NTR31: అతని నేల.. అతని పాలన

న్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఎన్టీఆర్‌30’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది పూర్తయిన వెంటనే ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అందులో తారక్‌ గుబురు గడ్డం.. కోర మీసంతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. ‘‘రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన.. కానీ, అతని రక్తం మాత్రం కాదు’’ అంటూ ఆ పోస్టర్‌పై ఓ వ్యాఖ్యను జోడించారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఎన్టీఆర్‌ ఇందులో చాలా విభిన్నంగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం గురించి ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. ‘‘20ఏళ్ల క్రితం నా మనసులో పడ్డ ఆలోచనకు రూపమే ఈ సినిమా. దీని హద్దులూ, పరిధులూ అప్పుడే మనసులో నిర్ణయించుకున్నా. ఎన్నాళ్లుగానో నా మనసులో పదిలపరచుకున్న నా కలల ప్రాజెక్ట్‌ని, నా డ్రీమ్‌ హీరోతో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని