Nikhil: ‘స్పై’.. యాక్షన్ షురూ
నిఖిల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.
నిఖిల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఓ ఫొటోను నెట్టింట పంచుకున్నారు. ఆ ఫొటోలో నిఖిల్, ఐశ్వర్య, ఇతర నటీనటులతో పాటు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడా, బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు కైకో నకహరా కనిపించారు. ‘‘ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. నిఖిల్ సరికొత్త లుక్‌తో.. భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరాకు సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. మకరంద్ దేశ్‌పాండే, సన్యా ఠాకూర్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలందిస్తున్నారు. జూలియన్ ఎస్ట్రాడా ఛాయాగ్రాహకుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AR Murugadoss: అయిదేళ్ల క్రితమే ఆయనకి కథ చెప్పాను: ఏఆర్ మురుగదాస్
సల్మాన్‌ఖాన్‌కు గతంలోనే స్క్రిప్ట్ వివరించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ తెలిపారు. -
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
సల్మాన్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో వస్తున్న రూమర్స్‌పై సల్మాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ స్పందించారు. -
Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు.. కనిపించని సైన్యం: పవన్ కల్యాణ్
‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’ అంటున్నారు పవన్‌కల్యాణ్ (Pawan kalyan). ఆయన కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ‘భగత్స్ బ్లేజ్’ అంటూ చిత్ర బృందం వీడియోను పంచుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్-హరీశ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ విజిల్స్ వేయిస్తోంది.
-
Fahadh Faasil: రాజమౌళి సమర్పణ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫహద్ ఫాజిల్ మూవీస్
Fahadh Faasil: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. -
Mohan Lal: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు మోహన్‌లాల్
తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు మోహన్‌లాల్ (Mohan Lal), ముకేష్ రిషి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అనంతరం మోహన్‌లాల్, ముకేష్ రిషిలతో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు.
-
Citadel: సమంత, వరుణ్‌ధావన్ ‘సిటడెల్’ ఇండియన్ సిరీస్ టైటిల్ ఇదే!
Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్ కలిసి నటించిన ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ టైటిల్‌ను ప్రకటించారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Surya: ‘సూర్య43’ వాయిదా.. ప్రకటించిన చిత్ర బృందం
‘సూర్య43’ సినిమా నిర్మాణం వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. -
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
Hanuman ott: జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన హనుమాన్ మూవీ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
మహేశ్ బాబుతో తాను చేయబోయే చిత్రం గురించి రాజమౌళి జపాన్ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
బాక్సాఫీస్ బరిలో అదిరే ఆట వసూళ్ల వేట
క్రీడా నేపథ్య కథలపై ప్రేక్షకులతో పాటు సినీతారలు మక్కువ కనబరుస్తుంటారు. ఆట.. అందులోని సవాళ్లు.. గెలుపు కోసం చేసే సాహసోపేతమైన ప్రయాణం.. -
గోవాకు దేవర
‘దేవర’ను పూర్తి చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
నిద్ర కోసం ఆరాటపడిన రోజులున్నాయి
‘సరదాగా తీసుకునే చిన్న చిన్న విరామాలు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, చిత్రాల ఎంపిక విషయంలో ఎంతో దోహదపడతాయని నా అభిప్రాయం’ అంటోంది మృణాల్ ఠాకూర్. చేతి నిండా సినిమాలు... -
ప్రేక్షకుల్లో గమనించిన మార్పు అదే!
‘‘కొత్త కథలతో సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం. పంపిణీదారుడిగా ఉన్నప్పుడు నా అభిరుచుల్ని కథానాయకులు నమ్మారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాతగా ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రాజేశ్ దండా. -
చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా
చిత్రసీమలో ఉత్తేజాన్ని, సినీ ఔత్సాహికుల్లో స్ఫూర్తిని నింపేలా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్టు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ప్రకటించాయి. -
‘మగధీర’, ‘ప్రేమికుడు’ మళ్లీ..
రామ్‌చరణ్ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’తోపాటు, ప్రభుదేవా కథానాయకుడిగా మరో అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ప్రేమికుడు’ రీరిలీజ్‌గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
ప్రతినాయకుడిగా శివాజీ
‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఇప్పుడాయన ‘అహం’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. -
మోహన్‌లాల్ @ 360
‘మలైకోటై వాలిబన్’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్. ప్రస్తుతం ఆయన.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. -
యమధీర రాజకీయం
కన్నడ తార కోమల్ కుమార్ కథానాయకుడిగా... శంకర్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యభూమిక పోషించారు.
తాజా వార్తలు (Latest News)
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్‌లకు సూర్య దూరమేనా? ఇన్‌స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం