
Pawankalyan: అధ్యాపకుడిగా తొలిసారి
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ను పూర్తి చేయాల్సి ఉంది. ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ తర్వాత పవన్ - హరీష్ కలయికలో రూపొందుతోన్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇది సూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండనుంది. పూర్తిగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పవన్ కల్యాణ్ తొలిసారి లెక్చరర్ పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన చాలా అందమైన లుక్‌లో కనిపిస్తారు. ఆగస్ట్ నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. 80శాతం షూటింగ్ ఇక్కడే కొనసాగుతుంది. దీన్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ఆలోచన లేదు’’ అని హరీష్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: తొలిరోజు రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చించిన భాజపా జాతీయ కార్యవర్గం
-
General News
TS corona: తెలంగాణలో 500 దాటిన కరోనా కేసులు
-
General News
Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!
-
Business News
D Mart: అదరగొట్టిన డీమార్ట్.. క్యూ1లో ఆదాయం డబుల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్‌చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ