Updated : 23 May 2022 06:49 IST

Vijay: మరోసారి ‘మాస్టర్‌’ కలయిక

మిళ నటుడు విజయ్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మాస్టర్‌’. తమిళంతో పాటు విడుదలైన  ప్రతి భాషలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. వీరిద్దరి కలయికలో మరో చిత్రం రానుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని   దర్శకుడు లోకేష్‌ ధ్రువీకరించాడు. ‘దళపతి 67’ వర్కింగ్‌ టైటిల్‌తో పూర్వ నిర్మాణ పనుల్ని ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ చిత్రం మాస్‌, క్లాస్‌ అంశాల మిళితంగా ఉండనుందని వెల్లడించాడు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విక్రమ్‌’ జూన్‌ 3న విడుదల కానుంది. విజయ్‌ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని