Shekar: ‘శేఖర్‌’ ప్రదర్శనల నిలిపివేత

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓ ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడింది. దీంతో ఆదివారం అన్ని థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శనలు నిలిపివేశారు.

Updated : 23 May 2022 06:56 IST

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓ ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన విషయంలో చట్టపరమైన చిక్కుల్లో పడింది. దీంతో ఆదివారం అన్ని థియేటర్లలో ఈ చిత్ర ప్రదర్శనలు నిలిపివేశారు. దీనిపై హీరో రాజశేఖర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ‘‘నాకు నా కుటుంబానికి సినిమాయే జీవితం. ఈ చిత్రాన్ని పూర్తి చేసి, విడుదల చేసేందుకు ఎంతో కష్టపడ్డాం. సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొందరు మాపై ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి చిత్రాన్ని థియేటర్లలో ఆడకుండా ఈరోజు నిలువరించారు. ఈ సినిమాపై మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. ఏదోలా సినిమా తిరిగి థియేటర్లలో ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం’’ అని రాజశేఖర్‌ భావోద్వేగంగా ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని