Updated : 24 May 2022 16:12 IST

మొక్కిందోటి.. దక్కిందోటి.. రంగో రంగా

అతను అనుకున్నదొకటి.. అయ్యిందొకటి. మొక్కిందొకటైతే.. దక్కింది మరొకటి. అతని నిక్కచ్చి పిచ్చికి తగ్గట్లుగానే.. కాలం కూడా కచ్చి కట్టింది. అందుకే ప్రతిదీ దక్కినట్లే దక్కి చేజారిపోతున్నాయి. ఈ కష్టాలన్నీ మరెవరివో కావు.. సుందరానివి. మరి అతనెవరు? అతని కథేంటి? తెలియాలంటే ‘అంటే.. సుందరానికీ’ చూడాల్సిందే. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వివేక్‌ ఆత్రేయ తెర కెక్కించారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మించారు. నజ్రియా కథానాయిక. ఈ సినిమా జూన్‌ 10న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ సినిమా నుంచి ‘‘రంగో రంగా..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. సినిమాలో నాని పాత్ర పడే కష్టాలను తెలియజేస్తూ.. వినోదాత్మకంగా ఈ పాటని తీర్చిదిద్దారు. ఈ గీతానికి వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చగా.. శనపతి భరద్వాజ పాత్రుడు సాహిత్యమందించారు. కారుణ్య ఆలపించారు. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి’’ అనిచిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి కూర్పు: రవితేజ గిరిజాల,ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని