
పదిరోజులు ముందుగానే ప్రదర్శనలు
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క తెరకెక్కించిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథతో రూపొందింది. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని విడుదల తేదీ కన్నా పదిరోజుల ముందు నుంచే దేశంలోని పలు నగరాల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈనెల 24న పుణె, 25న జైపూర్ - అహ్మదాబాద్, 27న దిల్లీ, 28న లక్నవూ, 30న బెంగళూరు, 31న కొచ్చి, జూన్ 1న ముంబయి, జూన్ 2న హైదరాబాద్‌లలో.. ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమాని ముందుగా ప్రదర్శించనున్నారు. ‘‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం అసాధారణమైనది. ప్రతి భారతీయుడు చూడవలసిన కథ. అందుకే ఈ రియల్ హీరో చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండనున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాని మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
God Father: ‘గాడ్ ఫాదర్’ ఆగయా.. లుక్‌తోనే అంచనాలు పెంచుతున్న చిరు
-
Business News
Suzuki katana: మార్కెట్లోకి సుజుకీ స్పోర్ట్స్ బైక్.. ధర ₹13.61 లక్షలు
-
India News
MK Stalin: ఎవరైనా అలా చేస్తే నేనే డిక్టేటర్‌గా మారతా.. చర్యలు తీసుకుంటా : సీఎం స్టాలిన్
-
Politics News
Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఎనిమిదో వికెట్ డౌన్.. క్రీజులో జడేజా, బుమ్రా
-
Movies News
Bimbisara: చరిత్రలోకి తీసుకెళ్లేలా ‘బింబిసార’ ట్రైలర్.. కల్యాణ్‌రామ్ రాజసం చూశారా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు