Published : 24 May 2022 02:02 IST

మెరిసేలే మెరిసేలే.. నీ చూపే తగిలే

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అంటూ వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోంది హన్సిక. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘‘మెరిసేలే మెరిసేలే.. నీ చూపే తగిలే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు మార్క్‌.కె.రాబిన్‌ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. సత్య యామిని ఆలపించారు. ‘‘తన జీవితంలో ఎదురైన సంఘర్షణన ఓ యువతి ఎలా ఎదుర్కొన్నది అన్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ట్విస్ట్‌లు, మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో హన్సిక పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి కూర్పు: చోటా కె.ప్రసాద్‌, ఛాయాగ్రహణం: కిషోర్‌ బోయిడపు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని