Published : 24 May 2022 02:02 IST

జోగిని రూపుమాపే లక్ష్యంతో..

నవీన్‌ కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ..    స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం  ‘శరపంజరం’. టి.గణపతి రెడ్డి, మల్లిక్‌ ఎం.వి.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లయ కథానాయిక. ఈ చిత్ర తొలి గీతాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘కాలం మారినా ఇంకా కొన్ని చోట్ల జోగిని లాంటి దురాచారాలు కొనసాగుతున్నాయి. వాటిని రూపు మాపే క్రమంలో చిత్ర దర్శక నిర్మాతలు జోగిని వంటి సామాజిక   కథాంశాన్ని ఎంచుకుని సినిమా చేశారు. దీనికి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘తెలంగాణలోని మట్టిని ముట్టుకుంటే ఎన్నో కథలు, కావ్యాలు, చరిత్రలు బయటకి వస్తాయి. అలాంటి మట్టి నుంచి ఏరుకున్న కథే ‘శరపంజరం’. గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగిందనేది   చిత్ర కథాంశం. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఊడుగుల, ఈటెల జమున, మామిడి హరికృష్ణ, కాసర్ల శ్యామ్‌, నవీన్‌ దేశబోయిన తదితరులు పాల్గొన్నారు.


నేటితరం ‘లవ్వాట’

క్రిష్‌ బండిపల్లి, మీరా కన్నన్‌, దీక్ష నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘లవ్వాట’. ఆర్‌.కె.గాంధీ తెరకెక్కిస్తున్నారు. ఎన్‌.వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బెనర్జీ కీలక పాత్ర  పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో  రూపొందుతోంది. ఈ చిత్ర టైటిల్‌ లోగోను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ   సందర్భంగా హీరో క్రిష్‌    మాట్లాడుతూ.. ‘‘గాంధీ చెప్పిన కథ వింటే నేనే కాదు.. ఎంత పెద్ద యువ హీరో అయినా వెంటనే ఓకే చెప్పేస్తారు’’ అన్నారు. ‘‘ప్రేమ పట్ల నేటితరం దృక్పథం ఎలా ఉందన్నది వినోదాత్మకంగా వివరిస్తూ ఈ సినిమా తెరకెక్కించాం. నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, మూసా అలీఖాన్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని