
ఎంత ప్రత్యేకమో.. మీరే చెబుతారు!
‘‘మరచిపోలేని అనుభూతి పంచుతుంది మృధుమయి పాట’’ అంటోంది మానుషి చిల్లర్. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో మానుషి కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘పృధ్వీరాజ్’. చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు.. పలు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మృధుమయి... ప్రేమ సదా మృధుమయి’ అనే గీత టీజర్‌ను విడుదల చేశారు. మానుషికి ఇది తొలి బాలీవుడ్ చిత్రం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ పాట చిత్రీకరణ ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా జరిగింది. పృధ్వీరాజ్-సంయోగితల మధ్య ప్రేమ వ్యక్తమయ్యే ఈ పాట నాకు ఎంతో ప్రత్యేకం. మొత్తం పాటను చూశాక మీరే అంటారు... అది ఎంత ప్రత్యేకమో. అంత బాగుంటుంది. అక్షయ్‌కుమార్ లాంటి స్టార్ హీరోతో చేయడం నాకు లభించిన వరం. ఈ సినిమా అన్ని భాషల్లోనూ విజయవంతమవుతుంది’’ అని పేర్కొంది. రాజ్‌పూత్ యోధుడు పృధ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా తీసిన ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సంజయ్‌దత్, సోనూసూద్ ఇతర ముఖ్యపాత్రల్లో కన్పిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా
-
Movies News
Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య
-
Politics News
JP Nadda: జేపీ నడ్డా రోడ్ షో... భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు
-
Sports News
IND vs ENG: మరోసారి కోహ్లీ విఫలం.. కష్టాల్లో టీమ్ ఇండియా
-
Politics News
Bhatti Vikramarka: మోదీజీ... తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు: భట్టి విక్రమార్క
-
Movies News
Social Look: ఫొటోతో అగ్గిరాజేసేలా రాశీఖన్నా.. అనుపమ ప్రచార సందడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..