Published : 24 May 2022 02:02 IST

సత్యజిత్‌ రే.. ‘ది స్టోరీటెల్లర్‌’

లెజెండరీ ఫిల్మ్‌మేకర్‌ సత్యజిత్‌ రే రచించిన ‘గోల్పోబోలో తరిణి ఖురో’ పుస్తకాధారంగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని అనంత్‌ నారాయణ్‌ మహదేవన్‌ తెరకెక్కిస్తున్నారు. జియో స్టూడియోస్‌ సహకారంతో పర్పస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, క్వెస్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో పరేష్‌ రావల్‌, ఆదిల్‌ హుస్సేన్‌, రేవతి, తన్నిష్ఠ ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ది స్టోరీటెల్లర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ విషయాల్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇదొక కల్పిత కథ. దోపిడీ చేసే, దోపిడీకి గురయ్యే వ్యక్తుల మనస్తత్వాన్ని అన్వేషిస్తుంది. సస్పెన్స్‌, వినోదం, ఎమోషన్స్‌.. అన్నీ ఉంటాయి. ఈ సినిమాతో రాబోయే తరానికి సత్యజిత్‌ రే లాంటి మాస్టర్‌ స్టోరీటెల్లర్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా, గౌరవంగా ఉంది’’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని