Cinema News: ఉద్వేగపరిచే..‘రాంగ్‌ నంబర్‌’

మారుతి రామ్‌, జియోడార్ల, హాసిని జంటగా సాంబశివరావు తెరకెక్కించిన చిత్రం ‘రాంగ్‌ నంబర్‌’. ఆర్‌.వి.యస్‌. రావు, ఫనా సంయుక్తంగా నిర్మించారు. అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు.

Updated : 25 May 2022 06:53 IST

మారుతి రామ్‌, జియోడార్ల, హాసిని జంటగా సాంబశివరావు తెరకెక్కించిన చిత్రం ‘రాంగ్‌ నంబర్‌’. ఆర్‌.వి.యస్‌. రావు, ఫనా సంయుక్తంగా నిర్మించారు. అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. అందరూ ట్రైలర్‌ బాగుందని మెచ్చుకుంటున్నారు. ట్రైలర్‌ కంటే సినిమా పదిరెట్లు బాగుంటుంది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘హీరో కొత్త వాడైనా అనుభవమున్నవాడిలా నటించాడు. దర్శకుడు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత ఆర్‌.వి.యస్‌.రావు. శ్రీరాములు, తిలక్‌ గంగాధర్‌ యాదవ్‌, దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని