Yash: ‘లక్కీ స్టార్‌’.. వచ్చేస్తున్నాడు

యశ్‌ కథానాయకుడిగా సూరి తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘లక్కీ’. దీన్ని తెలుగులో ‘లక్కీ స్టార్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత రవిరాజ్‌. రమ్య కథానాయిక. రాధికా కుమారస్వామి సమర్పిస్తున్నారు.

Updated : 25 May 2022 06:59 IST

శ్‌ కథానాయకుడిగా సూరి తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘లక్కీ’. దీన్ని తెలుగులో ‘లక్కీ స్టార్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత రవిరాజ్‌. రమ్య కథానాయిక. రాధికా కుమారస్వామి సమర్పిస్తున్నారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘వినోదం నిండిన ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. కన్నడలో విజయవంతమైన ఈ సినిమా.. మాకు తెలుగులో శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. యశ్‌ నటన, రమ్య గ్లామర్‌, అర్జున్‌ జన్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్న కుమార్‌, గురుచరణ్‌, సూర్య, కేశవ్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని