KamalHassan: కమల్‌ డిజిటల్‌ అవతారం

మేటి నటనతో ఆకట్టుకోవడమే కాదు.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే కథానాయకుడు కమల్‌హాసన్‌. త్వరలో ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘విక్రమ్‌’. దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

Updated : 25 May 2022 07:03 IST

మేటి నటనతో ఆకట్టుకోవడమే కాదు.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే కథానాయకుడు కమల్‌హాసన్‌. త్వరలో ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘విక్రమ్‌’. దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని ‘మెటావర్స్‌’ వెర్షన్‌లో విడుదల చేయనున్నట్టు కమల్‌ ప్రకటించారు. ప్రఖ్యాత కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా విక్రం ఎన్‌ఎఫ్‌టీలు (నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌) విడుదల చేయనున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఎన్‌ఎఫ్‌టీలు, వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీ మెటావర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తొలి చిత్రంగా విక్రమ్‌ నిలవబోతోంది. ఈ వివరాల్ని ‘విస్టావర్స్‌’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇందులో పోస్టర్లు, తారాగణం ముఖాముఖి, తాజా కబుర్లు, ఎక్స్‌క్లూజివ్‌ వీడియోలు.. సమస్తం ఉంటాయి. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్‌తోపాటు విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకుడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని